అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప ది రూల్ విడుదలకు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
తాజాగా ఈ చిత్రం మరో రికార్డు అందుకుంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.ఆన్‌లైన్ వేదికగా తమ ఆనందాన్ని తెలియజేస్తూ రచ్చ లేపుతున్నారు.