వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.సంక్రాంతి కానుకగా జనవరి 14న ఇది విడుదల కానుంది.ఇందులో మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.క్రైం కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.ఇప్పటికే అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో F2, F3 చిత్రాలు వచ్చి విజయం సాధించగా, ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.అయితే సంక్రాంతికి
పోటీలో ఇప్పటికే బాలకృష్ణ డాకు మహరాజ్,రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ తలపడుతున్నాయి.
#SankranthikiVasthunam on 14th January, 2025 🤗❤️#సంక్రాంతికివస్తున్నాం @AnilRavipudi@Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna #SameerReddy #Tammiraju @prakash3933 @SVC_official pic.twitter.com/Wc2BmTjqCZ
— Venkatesh Daggubati (@VenkyMama) November 20, 2024