ప్రముఖ డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన విషయం తెలిసిందే.ఇటీవల ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. Lతెలంగాణ హైకోర్టు ఇచ్చిన జానీకి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆ కేసు ఫిర్యాదు దారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.తాజాగా కేసు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ రద్దుకు నిరాకరించింది.హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
జానీ తనని వేధించాడంటూ ఆయన అసిస్టెంట్ కొంతకాలం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.పలుమార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని,మతం మార్చుకోమని ఒత్తిడి చేశాడని ఆమె అందులో రాసుకొచ్చింది.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.సుమారు నెల రోజుల పాటు జైలులో ఉన్న ఆయన అక్టోబర్ 25న బెయిల్ పొందారు.