ఇటీవల విడుదలైన కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం “క”. నూతన దర్శకులు సుజిత్-సందీప్ సంయుక్తంగా తెరకెక్కించారు.నయన్ సారిక,తన్వీ రామ్ కథానాయికలుగా నటించారు.దీపావళి కానుకగా విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించనుంది.నవంబర్ 28 నుండి ఈటీవీ విన్‌లో ఇది ప్రసారం కానుంది.
డాల్బీ విజన్:అట్మాస్‌లో దీనిని ఆస్వాదించవచ్చని ఈటీవీ విన్ పోస్ట్ పెట్టింది.కిరణ్ అబ్బవరం నటించిన తొలి పాన్ ఇండియన్ సినిమా ఇదే.సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమైంది.కిరణ్ ద్విపాత్రిభినయంలో కనిపించారు.రూ.50 కోట్లకు పైగా ఇది వసూలు చేసినట్లు సమాచారం.
ఆడుదాము #KA చ్చితంగా,
ఈసారి అదిరిపోయే సప్పుడు తో అద్భుతమైన పిక్చర్ తో…🔈🔉🔊Experience #KA with Dolby Vision Atmos 🤩
From Nov 28 Only on @EtvWin
A @SamCSmusic musical 🎶@Kiran_Abbavaram @UrsNayan @tanviram_ @DirSujith @sandeep_deep02 @srichakraas #KiranAbbavaram #EtvWin pic.twitter.com/VbwOIFS9e4— ETV Win (@etvwin) November 23, 2024