తనదైన ప్రత్యేక గాత్రం, శైలితో అనతికాలంలోనే తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు గాయని మంగ్లీ. ప్రస్తుతం ప్రేక్షకుల హృదయాలను రంజింపజేస్తూ ముందుకు సాగుతున్న ఆమె తాజాగా ఒక పురస్కారం సొంతం చేసుకున్నారు. సంగీత ప్రపంచానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల సంగీత నాటక అకాడమి నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారధుల సమక్షంలో ఆమె అందుకున్నారు. జార్జి రెడ్డి సినిమాలోని రాయల్ ఎన్ఫీల్డ్, అల వైకుంఠపురం చిత్రంలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియాతో సహా ఆమె ఆలపించిన అనేక పాటలకు మంచి స్పందన లభించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు