నటి సమంత తండ్రి ఇంట్లో విషాదం నెలకొంది.ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.“మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అని తెలిపారు.హృదయం ముక్కలైన ఎమోజి షేర్ చేశారు.సమంత జీవితంపై జోసెఫ్ ప్రభావం ఎంతగానో ఉంది.
ఇదే విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు.చిన్నతనంలో ఆయన మాటలు తన కాన్ఫిడెన్స్ పై ప్రభావం చూపాయన్నారు.తమ పిల్లల్ని అమాయకులుగా భావించే మిగిలిన తల్లిదండ్రుల మాదిరిగా ఆయన కూడా నన్నొక అయాకురాలిగా చూసేవారు.చిన్న పిల్లగా భావించేవారు.దానివల్ల ఇండస్ర్టీలోకి వచ్చిన కొత్తలో సక్సెస్ ని అంగీకరించడానికి చాలా టైం పట్టింది.నటిని అయ్యి..నా కాళ్ళ పై నేను నిలబడిన తర్వాత నాన్నకి నా పై నమ్మకం వచ్చింది.నన్ను చూసి గర్వపడ్డారు అని గతంలో సమంత చెప్పారు.