ఫొటో క్రెడిట్ విషయంలో నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య ఎక్స్ వేదికగా తాజాగా వీరిద్దరి మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది.రణ్‌వీర్ సింగ్‌తో దిగిన ఓ ఫొటోని తేజ షేర్ చేయగా.. ‘ఫొటో క్రెడిట్ లేదా పుష్పా’ అంటూ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.అంతేకాకుండా ‘మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలని అని ఓ పెద్దాయన చెప్పారు’ అని పేర్కొన్నారు.ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ‘మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా తెరపై మన పేరైనా’ అని ఇటీవల పుష్ప 2 ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్ వర్మ రిప్లైగా ఇవ్వడం వైరల్‌గా మారింది.
Previous Articleఐసీసీ ఛైర్మెన్ బాధ్యతలందుకున్న జై షా
Next Article పుష్ప ది రూల్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్