సాయిపల్లవి,శివ కార్తికేయన్ జంటగా నటించిన చిత్రం అమరన్.ఈ చిత్రం ఓటీటీ విడుదలను నిలిపివేయాలని కోరుతూ చెన్నైకు చెందిన విఘ్నేశన్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.‘అమరన్’ చిత్రం వల్ల తనకు ఇబ్బంది కలిగిందని పేర్కొన్నాడు ఇప్పటికే చిత్రబృందానికి లీగల్ నోటీసు పంపించామని పేర్కొన్నాడు.ఇంత జరిగినా చిత్రం నుండి తన ఫోన్ నెంబర్ తొలగించలేదని చెప్పాడు.కనుక ఈ చిత్రం ఓటీటీ విడుదలను నిలిపి వేయాలని కోరాడు.చిత్రబృందం నుండి రూ.1.1 కోటి పరిహారంగా ఇప్పించమని కోరాడు.దీపావళి కానుకగా ‘అమరన్’ విడుదలైంది.ఇందులోని ఒక సన్నివేశంలో సాయిపల్లవి.. శివ కార్తికేయన్ కు తన ఫోన్ నంబర్ ఇస్తుంది.అది నిజంగానే సాయిపల్లవి ఫోన్ నంబర్ అదేనని భావించిన పలువురు అభిమానులు కాల్స్ చేశారు.ఈ చిత్రంలో చూపించిన నంబర్ తనదేననీ వరుస ఫోన్ కాల్స్,సందేశాల వల్ల ప్రశాంతత లేకుండా పోయిందని విఘ్నేశన్ పేర్కొన్నాడు.పరిహారం కోరుతూ గత నెలలో మూవీ టీమ్ కి లీగల్ నోటీసు పంపించాడు.రేపు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్న సమయంలో తాజాగా మద్రాస్ హైహ్ కోర్టును ఆశ్రయించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు