అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పుష్ప ది రూల్.రేపు ఈ చిత్రం విడుదల కానుంది.ఫ్యాన్స్ మంచి నుంచి ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈరోజు రాత్రి నుంచి పలు రాష్ట్రాల్లో మిడ్ నైట్ షోస్ ఏర్పాటు చేశారు.ఇదిలా ఉండగా బెంగళూరులో మిడ్ నైట్ కు పర్మిషన్ రద్దు చేస్తూ కలెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారి చేశారు.ఉదయం ఆరు గంటలకు ముందు సినిమాలు ప్రదర్శించడం చట్ట విరుద్ధమని కర్ణాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.తెల్లవారుజామున షోలు ప్రదర్శించడానికి కూడా అంగీకరించలేదు.దీనిపై కర్ణాటకలోని అల్లు అర్జున్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్, సామ్ మ్యూజిక్ అందించారు.
Previous Articleఉద్యోగుల రిటైర్మెంట్ వయసుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత
Next Article పుష్ప-2 పై నాగబాబు సంచలన పోస్ట్…!