నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతడు “సింబా” అనే చిత్రం చేస్తున్నాడు.అయితే ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగాల్సింది. కాకపోతే అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. దీనితో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.ఈ నేపథ్యంలో బాలకృష్ణ తాజాగా మీడియాతో మాట్లాడారు.ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మోక్షజ్ఞ సినిమా గురించి మాట్లాడారు.ఆ సినిమా రోజే ప్రారంభం కావాల్సింది.కాకపోతే మోక్షజ్ఞకు కాస్త ఆరోగ్యం బాలేదు.వాతావరణం మారడం వల్ల స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు.అందుకే ప్రారంభ కార్యక్రమాన్ని మరో రోజుకు వాయిదా వేశాం.ఏది జరిగిన మన మంచికే అనుకోవాలి అని ఆయన అన్నారు.
Previous Articleకూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది:- మాజీ సిఎం జగన్
Next Article ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ :కొనసాగుతున్న డ్రాల పర్వం