స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప-2’ కు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి.హైదరాబాద్ నగరంలోని సంధ్యా థియేటర్ వద్ద “పుష్ప-2” బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.
ఈ మేరకు తెలంగాణ సినిమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు.అయితే హైదరాబాద్ నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వలన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు.కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు.ఈ ఘటన నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం,అల్లు అర్జున్ బృందంపై పోలీసులు ఇప్పటికే కేసు ఫైల్ చేశారు.