బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “యానిమల్”.గత ఏడాది విడుదల ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.దీనికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ తెరకెక్కనున్నట్లు ఇప్పటికే టీమ్ ప్రకటించింది.తాజాగా ఈ చిత్రం గురించి అప్ డేట్ ఇచ్చారు రణబీర్.2027 నుండి ఈ చిత్రం షూట్ ప్రారంభం కానుందని తెలిపారు.యానిమల్ తెరికెక్కించినప్పుడే దీనిని 3 భాగాలుగా తీయాలనుకున్నామని తెలిపారు.
అయితే పార్ట్ 2 చాలా స్పెషల్ అని అన్నారు.ఇందులో తాను హీరో,విలన్ గా కనిపించ నున్నానని చెప్పారు.పార్ట్-1 లో రష్మిక హీరోయిన్ గా కనిపించారు.అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు.ఈ చిత్రం తీవ్ర హింస ప్రోత్సహిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.ఇక ఈ సినిమాపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చాయి.