సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా,కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ‘సంబరాల ఏటి గట్టు’ అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ సినిమా గ్లింప్స్ ను చిత్రబృందం విడుదల చేసింది.‘ఎస్‌వైజీ’ కార్నేజ్ పేరిట ఈ గ్లింప్స్‌ను నిన్న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు.ఈ గ్లింప్స్‌లో సాయి తేజ్ క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు.
ఈ చిత్రానికి దర్శకుడు అజనీశ్ లోక్‌నాథ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు.ఇందులో సాయి దుర్గా తేజ్‌కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు.జగపతి బాబు,సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.