ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పట్ల హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు.తాజాగా ఆయన థియేటర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఈనెల 4న రాత్రి పుష్ప -2 ప్రీమియ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు.దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.ఈ ఘటనలో ఒక మహిళ మరణించిన విషయం తెలిసిందే.ఆమె కొడుకు శ్రీ తేజ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయంలో ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు ఆయ్యారు.శనివారం మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు.
Previous Article‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ పథకం మెనూ జోన్లవారీగా మార్పు
Next Article బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: డ్రాగా ముగిసిన మూడో టెస్టు