జానపద కళాకారుడు ‘బలగం’ చిత్రంతో విశేషంగా గుర్తింపు పొందిన మొగిలయ్య కన్నుమూశారు. కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురించి తెలుసుకొని మొగిలయ్య చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవి, ‘బలగం’ మూవీ దర్శకుడు వేణు చేయూత అందించారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వరంగల్లోని ఒక హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్ను మూశారు.
ఇక గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కి ఘన విజయాన్ని అందుకున్న ‘బలగం’ చిత్రంలో క్లైమాక్స్ వచ్చే భావోద్వేగభరితమైన పాటను ఆలపించి మొగిలయ్య ప్రేక్షకుల మన్ననలు పొందారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు