పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో ఈ నెల 4న చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా సినీ నటుడు అల్లు అర్జున్‌కు నిన్న నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసు ఇచ్చారు.అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్‌కు విచారణ కోసం హాజరు అవ్వనున్నారు.ఈ మేరకు చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.ఆ పరిసరాల్లోకి ఆయన అభిమానులెవరూ రాకుండా చర్యలు చేపట్టారు.తన న్యాయవాది పీఎస్‌కు రానున్న అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు.ఇక ఇప్పటికే తన లీగల్ టీమ్ తో పోలీసుల నోటీసులపై బన్నీ చర్చించారు.తొక్కిసలాట ఘటనపై ఇటీవల పోలీసులు 10 నిమిషాల వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.దీని ఆధారంగా అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన మీడియా సమావేశంపైనా కూడా ప్రశ్నించవచ్చని సమాచారం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు