ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, ఒంగోలు విమానాశ్రయాలపై నేడు సమీక్ష నిర్వహించారు. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పైన కూడా సమీక్షించారు. ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
దత్తపీఠాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు:
నేడు విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సందర్శించారు. గణపతి సచ్చిదానంద స్వామి ఆయనకు స్వాగతం పలికారు.