బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యువజన కార్యకర్తల దాడి ఘటనపై తెలంగాణ డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క స్పందించారు.భారత సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బీజేపీ నేతలు ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు.ఆవేశంలో బీజేపీ కార్యాలయంపై చేసిన దాడిని పార్టీ పెద్దలంతా ఖండించినట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీది అహింస సంస్కృతి అన్నారు.దాడి విషయంలో కాషాయ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ వార్నింగ్
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్నారు.బీజేపీ నేతల వ్యాఖ్యలు ఖండించాల్సినవేనని,అయితే పార్టీ కార్యాలయంపై దాడి సరికాదన్నారు.మరోవైపు బీజేపీ నేతలు ఇలా దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.శాంతిభద్రతల సమస్యలు రాకుండా బీజేపీ సహకరించాలని కోరారు.