పిఠాపురం నియోజకవర్గంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాల ప్రారంభోత్సవం జరగనుంది. ఇక ఈ గోకులాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన, దళిత, గిరిజన వర్గాల వారని అన్నారు.ఈ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక గణమైన విజయమని పేర్కొన్నారు. ఆవు బావుంటే రైతు బావుంటాడు.రైతు బావుంటే దేశం బావుంటుందని అన్నారు.మిల్క్ రెవల్యూషన్ అని గుజరాత్లో 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా రాబడి ఉందన్నారు. గత వైసీపీ పాడి పరిశ్రమ, ముఖ్యంగా ప్రభుత్వ పాల డైరీలను చంపేశారని వాళ్ళ సొంత డైరీలని పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఈ రోజు మనం నిర్మించిన 12,500 గోకులాలు కానీ, భవిష్యత్తులో నిర్మించబోయే మరో 20,000 గోకూలాలు, వీటి వల్ల రక్షణ ఉంటుంది, ఎండపట్టున ఉండవు, శుభ్రత ఉంటుందని స్పష్టం చేశారు. గుజరాత్ లోని మహిళలు 60,000 రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి మహిళలు కూడా భాగస్వామ్యం అయ్యి అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ రంగం ఒకరకంగా ఆత్మ నిర్భర భారత్, కాబట్టి మహిళలకు, పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ లబ్ధిగా ఉంటుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా ఒక గోకులాల ద్వారా, సకాలంలో జీతాలు అందించడం, పెన్షన్లు పెంచడం వంటి మంచి పనులతో రికార్డు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలు: పిఠాపురం నుండి ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read
Previous Articleహిందీ జాతీయ భాష కాదు:- అశ్విన్ వ్యాఖ్యలు వైరల్
Next Article నటి రష్మికకు గాయం