ఏపీ ప్రజలను ప్రధాని మోడీ దారుణంగా వెన్నుపోటు పొడిచారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. హోదా ఇస్తామని మోసం చేశారు. మొన్న మోడీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆక్షేపించారు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదు. ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు గురించి మాట్లాడలేదు. కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అలాంటి పార్టీతో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ఏపీ ప్రజలను దారణంగా మోసం చేసిన మోడీతో చంద్రబాబుది సక్రమ సంబంధం అయితే జగన్‌ది అక్రమ సంబంధమని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాల ఓట్లుతో గెలిచిన జగన్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను గంగలో కలుపుతున్నారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి బీజేపీని నిరంతరం వ్యతిరేకించారని ఆయన వారసులమని చెప్పుకునే జగన్ బీజేపీతో ఎందుకు కొమ్ముకొస్తున్నారని రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది తాను మాత్రమేనని షర్మిల పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరమని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు.
Previous Articleఇంటర్నేషనల్ క్రికెట్ కు భారత పేసర్ వరుణ్ ఆరోన్ వీడ్కోలు
Next Article ప్రభాస్ పెళ్లిపై రామ్‌చరణ్ కామెంట్…!