సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తెలంగాణా సహా పలు ఇతర ప్రాంతాల నుండి తమ తమ సొంత ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల బస్సులు తీసుకొని ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుండి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిట్ నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి ప్రజలను వాటి ద్వారా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రద్దీ తీవ్రంగా ఉన్న దారులలో ఈ తరహా ఏర్పాట్లతో ప్రజలకు కొంత వరకు ఇబ్బందుల్లేకుండా ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖ అధికారులతో సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు
By admin1 Min Read