ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో అసమాన ప్రతిభను కనబరిచిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండవల్లి లోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నితీష్ ను మంత్రి లోకేష్ అభినందించారు. రాష్ట్రంలో యువ క్రీడాకారులకు నితీష్ స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ చాలా బాగుందని తెలిపారు. అందులో క్రికెట్ ను కూడా చేర్చి యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని లోకేష్ ను కోరారు. త్వరలోనే అందరితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు.నితీష్ తో పాటు ఆయన తండ్రి కూడా లోకేష్ ను కలిశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు