దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు, జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహాన్ నాయుడు మంత్రులు మరియు అధికారుల బృందానికి జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ పర్యటన కోసం జ్యూరిచ్ చేరుకున్నారు. ఈసందర్భంగా ఏపీ సిఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇక ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.
Previous Articleశబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత…!
Next Article సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట