ప్రముఖ నటుడు, ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని నేడు కలిశారు. ఆయన ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు గారు అన్నారు. సోనూసూద్ తనదైన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ఎందరికో తన సాయాన్ని అందించారు. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో ఆయన చేసిన సేవలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి.
ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లు అందించిన సోనూసూద్:అభినందించిన సీఎం చంద్రబాబు
By admin1 Min Read