గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.అటువంటి నేరస్తుడిని సమర్థిస్తూ..మాజీ సీఎం జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోందని విమర్శించారు.ఈ మేరకు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ…మహిళలు, దళితులు అంటే జగన్ కు చిన్నచూపు ఉందని… వారికంటే వంశీలాంటి రౌడీలు జగన్ కు ఎక్కువయ్యారా? అని నిలదీశారు.కాగా దళిత యువకుడిని బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేయడానికి వంశీ కుట్ర పన్నారని…ఇంతగా బరితెగించిన వ్యక్తిని జగన్ ఎలా సమర్థిస్తారని రామానాయుడు ప్రశ్నించారు.అయితే తప్పును ఖండించకపోగా…తప్పు చేస్తున్న వారిని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు