విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన నదస్సును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కేసుల దర్యాప్తులో కీలకమైన డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా కేసుల పరిష్కారం, సమస్యలు సవాళ్లపై ప్రాసిక్యుటర్లకు అవగాహన కల్పించేలా ఈకార్యక్రమంలో వర్క్ షాప్ జరిగింది. నేరాలు జరిగినప్పుడు పోలీస్ శాఖ, ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయం కలిగేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. నేరాల నియంత్రణ, నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చేయడంలో అవసరమైన టెక్నాలజీ అందించేందుకు తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. పోలీసులు, ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయంతోనే నేరస్థులకు సత్వర శిక్ష పడుతుందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో అవగాహన నదస్సు: పాల్గొన్న ఏపీ హోం మంత్రి అనిత
By admin1 Min Read