ఏపీ సీఎం చంద్రబాబు జోక్యంతో మిర్చి రైతులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మిర్చి ధరలపై సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఢిల్లీలోని కృషి భవన్ లో ఈరోజు భేటీ అయినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల మొదటి వారం లో ఈ సమస్యను తెరపైకి తీసుకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు మార్గ దర్శకత్వంలో.. మిర్చి సేకరణ, ఎగుమతులను పెంచడానికి, మన రైతులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే మార్గాలపై చర్చించినట్లు తెలిపారు. మన మిర్చి రైతులను ఆదుకోవడానికి. కేంద్ర వ్యవసాయ మంత్రి ఎంతో ఆసక్తి కనబరిచారని వివరించారు. వారికి ప్రయోజనం చేకూర్చేలా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ధరను పెంచుతామని హామీ ఇచ్చారని దీనిని ముందుకు తీసుకెళ్లడానికి, కీలక సవాళ్లను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి ఐసీఏఆర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
Previous Articleస్టార్ డైరెక్టర్ శంకర్ కు ఈడీ షాక్
Next Article పవన్ “హరిహర వీరమల్లు” సెకండ్ సింగల్ ప్రోమో …!