ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మెజారిటీ ఉన్న వ్యక్తులు అధికారం స్థాపిస్తారు, రెండవ అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు, కానీ వైసీపీ లాగా గత ప్రభుత్వం మాది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే కుదరదని అన్నారు. నేడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా, వైసీపీకి 11 సీట్లు ప్రజలు ఇచ్చారు, అయినా సరే అసెంబ్లీకి రాకుండా, గొడవ చేస్తాం అంటే సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు . మీకు సమయం మీ స్థాయికి తగినట్లుగా ఇస్తాం అన్నా సరే వైసీపీ రావడం లేదు, ప్రజలు ఈ విషయం అర్ధం చేసుకోవాలని తెలిపారు. వైసీపీ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వారు వ్యవహరించే విధానం సరైనది కాదు. కేవలం అసెంబ్లీలో గొడవ చెయ్యడం మాత్రమే వైసీపీ విధానం అనడం సరి కాదు. మిమ్మల్ని మీరు స్థాయి పెంచుకోండి, విధానాలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. 5 సంవత్సరాల్లో కి ప్రతిపక్ష హోదా రాదు, ఇవ్వబడదని స్పష్టం చేశారు. మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. ప్రతిపక్ష హోదా అనేది స్థాయిని బట్టి, శాసనసభ నియమ నిబంధనల బట్టి ఇస్తారు. మీరు గొడవ చేస్తే ఇవ్వరు. అర్థం చేసుకుని అసెంబ్లీకి రావడం నేర్చుకోవాలని వైసీపీకి సూచించారు.
ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read