మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి భవన నమూనాపై ఉండవల్లి నివాసంలో అధికారులతో ఏపీ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరి ప్రజల 30 ఏళ్ల స్వప్నమని ఈ వంద పడకల ఆసుపత్రిని అత్యాధునిక వసతులతో నిర్మించాలని సూచించారు. వంద పడకల విభాగంలో దేశానికి రోల్ మోడల్‌గా, ప్రశాంత వాతావరణంలో వైద్యులు రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పేరెన్నికగన్న ఆసుపత్రుల భవన నమూనాలను పరిశీలించి అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ పై మంత్రి లోకేష్ సమీక్ష
By admin1 Min Read