చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. గంగాధర నెల్లూరు లో ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులను పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగుతూ వారిలో సంతోషం నింపారు. ఇక పెన్షన్ లబ్దిదారైన ఒక మహిళకు పెన్షన్ అందించిన ఆయన ఆమె కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకు రూ.2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని వారిని సంక్షేమ పాఠశాలల్లో చదివించాలని అధికారులను ఆదేశించారు. ఆ మహిళా కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయాలని కూడా చెప్పారు. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఉదయం 7 గంటలకు మొదలైన పింఛన్ల పంపిణీ. మూడు గంటల్లోనే 80% పెన్షన్ల పంపిణీ పూర్తయింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు