భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజా వేదిక సభలో మాట్లాడారు. రూ.200 పెన్షన్ ని రూ.2000 చేసాం. ఇప్పుడు వచ్చీ రాగానే, మొదటి నెలలోనే వెయ్యి పెంచి, రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల కష్టాలు, వారి సమస్యలు తెలియవని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తేనే తెలుస్తాయని స్పష్టం చేశారు. వైసీపీ పొనీ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని దుయ్యబట్టారు. ఆ దారుణాలు తెలుసుకుని ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..!
By admin1 Min Read