వైసీపీ లోని కొందరు నేతలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో వారు ఎదగడానికి తనను కొందరు కిందకు లాగారని అన్నారు. వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోందని కోటరీ నుండి బయటకు రాకపోతే జగన్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన మనసులో జగన్ పట్ల గౌరవం ఉందని జగన్ మనసులో తనకు స్థానం లేదని అందుకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని చెప్పారు. కోటరీ మాటలు వినొద్దని జగన్ కు స్పష్టంగా చెప్పానని తెలిపారు. భవిష్యత్తుల్లో మళ్లీ వైసీపీలో చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. విరిగిపోయిన మనసు మళ్లీ అతుక్కోదని అన్నారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
Previous Articleస్టార్ లింక్ తో జియో ఒప్పందం..!
Next Article స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..!