గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన అసెంబ్లీలో సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం, మొత్తం రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా వెల్లడైనట్లు పేర్కొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రత్యేకంగా సోషల్ ఆడిట్ పై దృష్టిపెట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయంలో జరిగిన అనేక అవకతవకలు, నిధుల దుర్వినియోగం వెలుగులోకి తీసుకొచ్చాం. దాదాపు 546 మండలాల్లో ఇప్పటికే సోషల్ ఆడిట్ పూర్తికాగా, మిగతా మండలాల్లో మార్చి 31 నాటికి పూర్తికానుంది. దాదాపు ₹250 కోట్ల అవినీతి జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దానిలో ₹71 కోట్లు రికవరీ చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీచేయడం జరిగిందని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు