కృష్ణా జిల్లా, మల్లవల్లి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన అశోక్ లేల్యాండ్ యూనిట్ ను విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనిద్వారా మొదటి విడతలో 600మంది, రెండవ విడతలో 1200మంది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుపొందింది ”అశోక్ లేలాండ్ ప్లాంట్’. ఇక తన యువగళం పాదయాత్రలో, గన్నవరం వచ్చినప్పుడు, మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ మళ్ళీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చానని తెలిపిన లోకేష్, ఇప్పుడు నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి “బాబు” అనే బ్రాండ్ తో, అనేక పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.మల్లవల్లి పారిశ్రామికవాడలోని 75 ఎకరాల్లో విస్తరించిన అశోక్ లేలాండ్ ప్లాంట్. ఫేజ్-1, 2లో ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయనుంది.