తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఇక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోజూ ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. అన్నదానానికి చాలామంది వితరణ ఇస్తున్నారు. భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. సమాజహితం కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ నాడు ఎన్టీఆర్ గారు ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్, రోజు రోజుకీ దిగ్విజయంగా ముందుకు వెళ్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో తిరుమలలో జరిగినవి అన్నీ ప్రజలు చూసారని ఎన్నో అపవిత్ర కార్యక్రమాలు ఇక్కడ జరిగాయని దుయ్యబట్టారు. ఆ రోజే చెప్పిన విధంగా ఇక్కడ నుంచే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించానని పేర్కొన్నారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఏడుకొండలను ఆనుకొని ముంతాజ్ హోటల్ కు అప్పట్లో అనుమతిచ్చారు. 35.32 ఎకరాల్లో హోటల్ కు అనుమతులు రద్దుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడుకొండలను ఆనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదని అన్నారు. వెజిటేరియన్ మాత్రమే పెడతామని ముందుకొచ్చారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు అనుమతి లేదని చెప్పామని తెలిపారు. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినా, ఆ రోజు ప్రాణాలతో బయట పడ్డాను అంటే, అది వెంకటేశ్వర స్వామి మహిమ అని పేర్కొన్నారు. ఏడుకొండలు.. వెంకటేశ్వరస్వామి సొంతం. ఈ ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో, తిరుమలలో 7 కొండలు కాదు, 5 కొండలు అంటే అసెంబ్లీలో పోరాడి, స్వామి దగ్గరకు పాదయాత్రకు వచ్చి మొక్కలు చెల్లించిన విషయం గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయం కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకొస్తే ఆలయ నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు