గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని, తనను జైలుకు పంపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.తనపై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులకు సూచించారని వెల్లడించారు. ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ రాజాసింగ్ హాజరుకాకపోవడం పార్టీ వర్గాల్లో అనేక సందేహాలకు కారణమైంది.అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్న సమయంలో రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో కలిసే వారికంటే,నిజమైన బీజేపీ నేతకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కార్యకర్తలకు నిబద్ధతతో పని చేసే నేతను అధ్యక్షుడిగా నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు