ఆంధ్రప్రదేశ్ లోని పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు.పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యం ఇది రాష్ట్ర పరిస్థితి ఇదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లతో పోలిస్తే రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆక్షేపించారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట. గత 10 ఏళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్పా మరోకటి కాదని పేర్కొన్నారు . సీఎం నాడు ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. లీటరుకు 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంధనం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో సమాధానం చెప్పాలి. 17 రూపాయలు ధర తగ్గించి ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు: షర్మిల
By admin1 Min Read