5 ఏళ్ళు అధ్వాన్నంగా తయారైన రోడ్లు ఒక్కోటి బాగు చేసుకుంటూ వస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంతలు పడిన 20 వేల కి.మీ రోడ్లు బాగు చేశామని పేర్కొన్నారు. ఇంకా రూ.1000 కోట్లు కావాల్సి ఉందని…వాటిని కూడా విడుదల చేస్తామని వివరించారు. ప్రభుత్వం పీ4ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఉగాది రోజున దీనికి నాంది పలుకుతున్నాం. రూ.9.74 లక్షల కోట్ల అప్పు పెట్టి వెళ్లారు. అప్పులు, వడ్డీలు చెల్లింపులు మనం సమయానికి కట్టక పోతే, క్రెడిబిలిటీ పోతుంది. ఆ క్రెడిబిలిటీ పోకుండా వ్యవహరిస్తున్నాం. అభివృద్ధి చేయాలి….దానితో పాటు ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేయాలి. నేను ఒక్కడినే పరిగెత్తుతూ పనిచేస్తే సరిపోదు నాతో పాటు అంతా పరిగెత్తాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ఒక్కడినే పరిగెత్తుతూ పనిచేస్తే సరిపోదు నాతో పాటు అంతా పరిగెత్తాలి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Article‘పెద్ది’ గా మాస్ లుక్ లో అదరగొడుతున్న రామ్ చరణ్..!
Next Article భారత్ -యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందాల చర్చలు ప్రారంభం

