అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒక నెటిజన్ షేర్ చేసిన వీడియో పట్ల లోకేష్ స్పందించారు. సదరు వీడియోలో నెల్లూరుకు చెందిన చిన్నారి భవ్య శ్రీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల మధ్య తేడాలను మరియు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల నైపుణ్యాలను ఎలా మెరుగుపరుస్తున్నాయో వివరంగా చూపించింది. దయచేసి ఈ వీడియోను వీక్షించి, నాణ్యమైన విద్యను అభివృద్ధి చేసే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని సుబ్రహ్మణ్యం అనే నెటిజన్ లోకేష్ ను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందిస్తూ లోకేష్ ప్రేరణాత్మకమైన వీడియోను షేర్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Thank you, Subrahmanyam Donthi Garu, for sharing the inspiring video of Bhavya Sri from Nellore. Her eloquent comparison between government and private schools highlights the significant improvements in our public education system. We remain committed to initiatives that enhance… https://t.co/Tnm9VaovET
— Lokesh Nara (@naralokesh) March 27, 2025