తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు… జాతిని సజీవంగా నిలుపుతాయని అన్నారు. మన ముంగిళ్లకు వచ్చిన ‘ఉగాది’ తెలుగువారి వారసత్వపు పండుగ. విశ్వావసు అనే గంధర్వుడు పేరుతో వచ్చిన ఈ ఉగాది పండుగ తరుణాన తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితం కష్టసుఖాల సమ్మేళనం. మన ఉగాది పచ్చడిని అందుకు సంకేతంగా భావిస్తాము. గత ప్రభుత్వ పాలన కష్టాలమయమైపోగా – ఇప్పుడు ప్రజలకు సుఖాలను అందించే మంచి పాలన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ముంగిటకు వచ్చింది. చైత్ర మాసపు శోభతో వసంతాన్ని మోసుకువచ్చిన శ్రీ విశ్వావసు నామ ఉగాది… తెలుగు లోగిళ్ళను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Previous Articleప్రయాణికుల కోసం రైల్వే కొత్త సదుపాయం …!
Next Article చీరాల, బాపట్ల మధ్యలో టూరిజం సర్క్యూట్ కు సన్నాహాలు