రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ని తీర్చిదిద్దేందుకు, ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు,ప్రొఫెసర్లు,మేధావులు ముందుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తాజాగా సచివాలయంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో సీఎం సమావేశం అయ్యారు. ఆర్టీఐహెచ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న టాటా గ్రూపు, టాటా సన్స్ చైర్మన్ శ్రీ ఎన్ చంద్రశేఖరన్ సహా మరికొందరు ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కళలకు రంగులు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపి కల్చరల్ మిషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 4న నిర్వహిస్తున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కు రంగువేయడం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.
‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ …పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో సీఎం సమావేశం
By admin1 Min Read