ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. దిగ్గజ నేత బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. 30 ఏళ్ల క్రితమే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేసినట్లు వివరించారు. సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారని పేర్కొన్నారు . ఇక ఇప్పుడు P4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్, పార్టనర్ షిప్) అనే వినూత్న కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు ఇస్తామని పునరుద్ఘాటించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి చేయాలని సూపర్-6 హామీలు అమలు చేయాలని పేర్కొన్నారు. దేశంలో ఇంత ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీనేనని అన్నారు. పేదరిక నిర్మూలన జరగాలి.. తలసరి ఆదాయం పెరగాలని సంపద సృష్టి తోనే అది సాధ్యమవుతుంని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు