ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేసాడు శ్రీ రామచంద్రుడు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందామని పేర్కొన్నారు. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. ఆ సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ధర్మమార్గంలో నడిచినవారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు: మంత్రి నారా లోకేష్
ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. ధర్మమార్గంలో నడిచినవారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ శ్రీరామ నవమి అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని.. శ్రీరామ చంద్రమూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read