ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుపరిపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా మండలి ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, ఐఐటీ సహా వివిధ రంగాల నిపుణులు ఉండనున్నారు. జూన్ 12 కల్లా వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి అన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా, గుడ్ గవర్నెన్స్ అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చనే దానిపై ఈ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా ఆన్‌లైన్, డిజిటల్, వాట్సాప్ గవర్నెన్స్ తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోను ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకుని ప్రజలు సేవలు పొందేలా అవగాహన కల్పించడంతో పాటు వాట్సప్ గవర్నెన్స్‌ను మరింత విస్తృతం చేసేలా చూడాలని ఆదేశించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు