వాలంటీర్ల పేరుతో గత పాలకులు వంచించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక జీవోలు లేవని స్పష్టం చేశారు. ఏజెన్సీ రెండు రోజుల పర్యటనలో భాగంగా కురిడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ యువతను మోసం చేశారని వాలంటీర్లకు గతంలో ఇచ్చిన హామీపై క్యాబినెట్ లో పలుమార్లు చర్చించినట్లు తెలిపారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ పర్యటనలో భాగంగా ప్రారంభించారు. కురిడి గ్రామ అభివృద్ధి నిమిత్తం సొంత నిధుల నుంచి రూ. 5 లక్షలు ప్రకటించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటకశాఖ సంయుక్త కార్యాచరణలో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, టూరిజంకి ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉమ్మడి సేంద్రీయ వ్యవసాయం పెరగాలని కేరళ తరహా పర్యాటకం మన దగ్గర అధికమవ్వాలని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మమేకమయ్యారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు