ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సంతాప దినాలు తెలిపింది. జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేశారు. జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ దుశ్చర్యను ఖండించి, మృతులకు సంతాపం తెలియచేశారు . జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ చీకటి సమయంలో, మనం దృఢంగా నిలబడుతున్నాం; ఉగ్రవాదంతో మన భారత్ ఐక్యతను చెడగొట్టలేరు. న్యాయం జయించేందుకు, ఇటువంటి దారుణాలు మళ్లీ జరుగకుండా చూసేందుకు మన నాయకత్వం బలంతో, సంకల్పంతో స్పందిస్తుందన్న పూర్తి నమ్మకం ఉందని పవన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
The horrific Pahalgam attack has deeply shaken us. My heart goes out to the bereaved families. As a mark of respect & solidarity, JanaSena will observe 3 days of mourning across the Telugu States. Our party flag will fly at half-mast.
In this dark hour, we remain resolute; Our… pic.twitter.com/TdVd9pTEsn— Pawan Kalyan (@PawanKalyan) April 23, 2025