నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిందని ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇది అని పేర్కొన్నారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు. కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరమని అన్నారు. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించామని వివరించారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం. కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్టజీవుల ప్రభుత్వంగా ఉంటుందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
Previous Articleసింహాచలం దుర్ఘటన… ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్
Next Article చెన్నైకు మరో ఓటమి… పంజాబ్ కింగ్స్ కు విజయం