విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఘన నివాళులు అర్పించారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్. ‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఆయన. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చినా, మండల వ్యవస్థతో పాలనారంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లినా, పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచినా, కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చినా … ఏది చేసినా ఆయన మనసులో ఉన్నది ఒక్కటే… ‘‘నా తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకు నిలబడాలి’’ అనే సంకల్పమే. చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదు… చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు అన్న ఎన్టీఆర్. ఈనాటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తున్నదంటే అది ఆయన ఆశీర్వాదబలమే. ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలూ కష్టపడుతూనే ఉన్నాం…. సమసమాజాన్ని సాధించే దిశగా సాగుతున్నాం. అనితరసాధ్యమైన ఎన్నో పనులు చేసిన అన్న నందమూరి తారకరామారావుకు మరొక్కమారు ఘన నివాళి అర్పిస్తున్నాను.
టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేష్:
తెలుగువారి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభం అయిన ఆయన ప్రయాణం ఒక మహాశక్తిగా మారింది. సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ఆదర్శంగా నిలిచారు. ప్రజా నాయకుడిగా పేద ప్రజల ఆకలి తీర్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేశారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని నిత్య శ్వాసగా చేసుకొని ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు. ఆయన ప్రతి అడుగు నేటి తరానికి మార్గదర్శి. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు