స్వర్ణాంధ్ర కార్యాలయాలను సచివాలయం నుండి ఏపీ సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సర్వీస్ సెక్టార్ నుండి మనకు 6.3 శాతం ఆదాయమే వస్తోందని, దానిని విస్తరిస్తే ఇన్ కం పెరుగుతుందని తెలిపారు.
టెక్నాలజీ అనేది గేమ్ ఛేంజర్ అని భవిష్యత్లో అదే కీలకమని అన్నారు. భవిష్యత్లో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయని చెప్పారు. ఇక ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని వివరించారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తాం. దీపం-2 కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తాం. 21 దేవాలయాల్లో అన్న ప్రసాదం ఏర్పాటు చేశాం. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. విధ్వంసం నుండి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. పేదల కోసం తీసుకొచ్చిన పీ-4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా జరగాలని స్పష్టం చేశారు. తలసరి ఆదాయాన్ని ఏటా బెంచ్ మార్క్ కింద సమీక్ష చేస్తాం. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల డయాఫ్రం వాల్ ఖర్చు రెండున్నర రెట్లు పెరిగింది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. విశాఖను ముంబయిలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖ నగరానికి అనేక పరిశ్రమలు, ఐటీ సంస్థలు వస్తున్నాయన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అవుతున్నాయి. పోలవరం-బనకచర్ల అనుసంధానం చేస్తాం. తిరుపతిని కూడా అనేక విధాలుగా అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు.
Previous Articleలాభాలతో వారాన్ని ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Next Article బాలయ్య అభిమానులకు అదిరే గిఫ్ట్… అఖండ-2 టీజర్