ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించి అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషమని పేర్కొన్నారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చిందని పేర్కొన్నారు.
Previous Articleభారత బృందాలకు ప్రధాని మోడీ అభినందనలు
Next Article WTC ఫైనల్: మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 ఆలౌట్